AP: తనకు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని పలువురు టీడీపీ నేతలు డిమాండ్లపై మంత్రి నారా లోకేష్ స్పందించారు. 'అవి రాజకీయపరమైన కామెంట్లు. ప్రజలు మాకు 94 శాతం సీట్లు ఇచ్చారు. గత ఐదేళ్లలో రాష్ట్రం ఇబ్బందుల పాలైంది. ఆంధ్రా మోడల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం. నాకు ఇప్పటికే చేతి నిండా పని ఉంది. సీఎం చంద్రబాబు ఇచ్చిన 2.5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీకి చేరుకోవాలి' అని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.