NTR ట్రస్ట్ ఆధ్వర్యంలో యుఫోరియా మ్యూజికల్ నైట్ నిర్వహించనున్నట్లు ఎన్టీఆర్ ట్రస్ట్ ఛైర్మన్, ఏపీ సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి తెలిపారు. ఈ సందర్భంగా నేడు అమరావతిలో నారా భువనేశ్వరి కీలక వ్యాఖ్యలు చేశారు. ఫిబ్రవరి 15న విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వేదికగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరవుతారని కానీ వారు కూడా టికెట్ తీసుకునే రావాలన్నారు.