ఏపీ సీఐడీ మాజీ‌ చీఫ్‌పై క్రమశిక్షణ చర్యలకు ఆదేశం

52చూసినవారు
ఏపీ సీఐడీ మాజీ‌ చీఫ్‌పై క్రమశిక్షణ చర్యలకు ఆదేశం
ఏపీ సీఐడీ మాజీ చీఫ్‌ సంజయ్‌పై క్రమశిక్షణ చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. అగ్నిమాపకశాఖ డైరెక్టర్‌గా ఉన్నప్పుడు అధికార, నిధుల దుర్వినియోగం చేశారని సంజయ్‌పై ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో నిబంధనల ఉల్లంఘన, క్రమశిక్షణ రాహిత్యంపై వివరణ ఇవ్వాలని డిసిప్లినరీ ప్రొసీడింగ్స్‌ జారీ చేస్తూ సీఎస్‌ విజయానంద్‌ ఆదేశాలు జారీ చేశారు. అభియోగాలపై నెలలోపు వివరణ ఇవ్వాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్