డేటింగ్ పేరుతో విశాఖలో బడా మోసం వెలుగులోకి వచ్చింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫైక్ ఐడీతో నగరానికి చెందిన యువకుడిని ట్రాప్ చేశారు. మాయ మాటలు చెప్పి రూ.28 లక్షలు కొట్టేశారు. దాంతో బాధితుడు సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.6 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.