AP: టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకు మంత్రి పదవి దక్కనున్నట్లు తెలుస్తోంది. నాగబాబుతో పాటు ఆయనను మంత్రి వర్గంలోకి తీసుకోనున్నట్లు సమాచారం. నాగబాబుతో కలిపితే నిబంధనల ప్రకారం 25 మంది మంత్రులు ఉంటారు. దీంతో పల్లా కోసం సరిగ్గా పని చేయని ఓ మంత్రిపై వేటు వేసేందుకు సీఎం చంద్రబాబు సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇతర వ్యవహారాల్లో వేలు పెట్టే మంత్రులపై వేటు వేసి కొత్త వారిని తీసుకోవాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.