మంగళగిరి ఎయిమ్స్‌కు సీఎం చంద్రబాబు గుడ్‌న్యూస్ చెప్పారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో కలిసి ఎయిమ్స్ స్నాతకోత్సవంలో పాల్గొన్న చంద్రబాబు ఈ సందర్భంగా మాట్లాడారు. అమరావతి భారతదేశపు భవిష్యత్ సిటీ అని, మంగళగిరి ఎయిమ్స్ భారతదేశంలోనే నంబర్ 1 అవుతుందనే నమ్మకం తనకు ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఆసుపత్రిని మరింత అభివృద్ధి చేసేందకు 10 ఎకరాలు ఇస్తామని వెల్లడించారు.