టీమిండియా హెడ్‌కోచ్‌గా నియమితులైన గౌతమ్ గంభీర్‌పై
ఆస్ట్రేలియా మాజీ ప్లేయర్ బ్రెట్లీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'అవకాశం లభించినప్పుడల్లా గంభీర్ అద్భుతమైన పనితీరు కనబరుస్తారు. అతడు గొప్ప ఆటగాడు. అలాగే ఆటగాళ్లను ఏకం చేయడానికి ఒక మార్గాన్ని కనుగొంటాడు. బలమైన జట్టును నిర్మిస్తాడు. అతడి దూకుడు స్వభావం, గెలవాలన్న కసి టీమిండియాకు సహాయపడుతుంది. గంభీర్ కోచ్‌గా టీమిండియా సురక్షితమైన చేతల్లో ఉంది' అని బ్రెట్లీ అన్నారు.