భర్త మద్యం తాగకుండా చేస్తానని.. భార్యని రేప్ చేసిన తాంత్రికుడు

578చూసినవారు
భర్త మద్యం తాగకుండా చేస్తానని.. భార్యని రేప్ చేసిన తాంత్రికుడు
మధ్యప్రదేశ్‌లో దారుణం చోటు చేసుకుంది. భర్త మద్యపానం వ్యసనం నుంచి బయటపడేయాలని ఓ మహిళ తాంత్రికుడిని ఆశ్రయించగా ఆమెపై అత్యాచారం చేశాడు. ఈ ఘటన గ్వాలియర్‌లోని ఉటైలా గ్రామంలో జరిగింది. తాంత్రికుడు తనని బెదిరిస్తూ రెండు నెలలు పాటు జూలై 10 వరకు అత్యాచారానికి పాల్పడినట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనకు లొంగకపోతే ‘ఆత్మలు’ వెంటపడుతాయని బెదిరించేవాడని తెలిపారు. నిందితుడిని పోలీసులు మంగళవారం అరెస్ట్ చేయగా భార్యభర్తలిద్దరూ ఆత్మల ప్రభావంలో ఉన్నారని చెప్పడం గమనార్హం.

సంబంధిత పోస్ట్