మహా కుంభమేళా తొక్కిసలాటపై మమతా బెనర్జీ సంచలన ఆరోపణ

61చూసినవారు
మహా కుంభమేళా తొక్కిసలాటపై మమతా బెనర్జీ సంచలన ఆరోపణ
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాలో ఇటీవల జరిగిన తొక్కిసలాటలో పలువురు భక్తులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. మహా కుంభమేళాలో చాలా మంది మరణించినప్పటికీ యూపీ ప్రభుత్వం సరైన సంఖ్యని చెప్పడం లేదని ఆరోపించారు. భక్తులకు సరైన సౌకర్యాలు ఏర్పాటు చేయడంలో యోగి ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిందని దుయ్యబట్టారు.

సంబంధిత పోస్ట్