TG: మహిళల ఉపాధి కల్పనకు, వ్యాపారాల్లో రాణించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తోందని మంత్రి సీతక్క పేర్కొన్నారు. మంత్రి సీతక్క, ప్రజాభవన్‌లో 25 సంచార చేపల విక్రయ వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. మహిళలు ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యం అని వెల్లడించారు. రూ. 10 లక్షల విలువైన వాహనాలను రూ. 6 లక్షల సబ్సిడీతో కేవలం రూ. 4 లక్షలకే లబ్ధిదారులకు అందజేస్తున్నామని తెలిపారు.