మన కవులు, రచయితల గొప్పతనాన్ని తెలియజేసేలా తెలుగు సాహితీ యాత్రలు నిర్వహించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తోందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు. పవన్ కల్యాణ్ ను విజయవాడ బుక్ ఫెయిర్ కమిటీ ప్రతినిధులు కలిశారు. ఈ సందర్భంగా కొన్నేళ్లుగా పుస్తక మహోత్సవ నిర్వహణకు అవసరమైన మైదానం అందుబాటులో లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని వారు పవన్ కు వివరించారు. ఈ సమస్యను పరిష్కరిస్తామని డిప్యూటీ సీఎం హామీ ఇచ్చారు.