వైసీపీ నేత బోరుగడ్డ అనిల్‌ను న్యాయస్థానం అనుమతితో అనంతపురం పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. కస్టడీలో భాగంగా రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి ఫోర్త్ టౌన్ పోలీసులు అనంతపురం తీసుకువచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులు, జడ్జిలను కించపరిచే విధంగా మాట్లాడిన కేసులో అనిల్‌ను ఫోర్త్ టౌన్ పోలీసులు విచారించనున్నారు. అనిల్ 3 రోజులు పాటు అనంతపురం పోలీసుల కస్టడీలో ఉండేదుకు కోర్టు అనుమతించిన విషయం తెలిసిందే.