పాలకూరలో ఐరన్ అధికంగా ఉంటుంది. అలాగే విటమిన్లు ఎ, సి, కె, మెగ్నిషియం, పొటాషియం అధికంగా ఉంటాయి. ఒక కప్పు పాలకూర ద్వారా 2.7 మిల్లీగ్రాముల ఐరన్ లభిస్తుంది. పాలకూర తినినా నేరుగా ఐరన్ పొందలేము. కనుక విటమిన్ సి ఉండే ఆహారాలను తినాల్సి ఉంటుంది. దీంతో విటమిన్ సి సహాయంతో మన శరీరం పాలకూరలో ఉండే ఐరన్‌ను శోషించుకుంటుంది. పాలకూరను పచ్చిగా కంటే ఉడకబెట్టి తింటేనే ఐరన్ శాతం ఎక్కువవుతుంది.