నాగార్జున సాగర్‌నుంచి ఏపీకి నీటిని విడుదల చేయాలని కృష్ణా రివర్‌మేనేజ్‌మెంట్ బోర్డు(కేఆర్ఎంబీ) ఆదేశాలిచ్చింది. సాగర్ఎడమకాల్వ జోన్–3లోని ఏపీ ఆయకట్టుకు 12 టీఎంసీల జలాలను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ జోన్‌లోని ఆయకట్టుకు ఇప్పటికే ఏపీ 9.55 టీఎంసీలను వినియోగించుకోగా.. మళ్లీ బోర్డు నీటిని విడుదల చేయనుంది. తమకు డిసెంబర్ 1 నుంచి 31 వరకు15.86 టీఎంసీలు అవసరమని, జలాలు విడుదల చేయాలని బోర్డుకు ఏపీ సర్కారు విజ్ఞప్తి చేసింది.