ఛత్తీస్‌గఢ్ లోని నారాయణ్‌పూర్ జిల్లాలో డీఆర్జీ, బీఎస్ఎఫ్ జవాన్లు కూంబింగ్‌లో భాగంగా శనివారం మావోయిస్టుల శిబిరాన్ని ధ్వంసం చేశారు. ఈ శిబిరంలో ఆయుధాలు తయారు చేసే మెషీన్లు, గ్యాస్, ఆక్సిజన్సిలిండర్లు, డిటోనేటర్లు, భారీగా పేలుడు పదార్థాలు, సోలార్ ప్లేట్లు, పెద్ద పెట్టె, కిట్ బ్యాగులు, విప్లవ సాహిత్యం, నిత్యావసర సరుకులు స్వాధీనం చేసుకున్నారు.