AP: తూర్పు గోదావరి జిల్లా నల్లజర్ల మండలం అనంతపల్లిలో శనివారం రాత్రి ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. వెలగన దుర్గయ్య అనే వ్యక్తి ఇంట్లో షార్ట్ సర్క్యూట్ అయ్యి మంటలు చెలరేగాయి. క్షణాల్లో మంటలు విస్తరించడంతో ఇల్లు పూర్తిగా దగ్ధం అయింది. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. 3 కాసుల బంగారం, కొంత నగదుతో పాటు ఇంట్లోని సామన్లు కాలి బూడిదయ్యాయని వెలగన దుర్గయ్య ఆవేదన వ్యక్తం చేశారు.