ఫిజి అత్యున్నత పౌరపురస్కారం 'ఆనరరీ ఆఫీసర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఫిజి'ని ఇటీవల ఆధ్యాత్మికవేత్త రవిశంకర్‌కు ప్రదానం చేశారు. ఫిజి అధ్యక్షుడు రాతు విలియమ్ కటోనివరే ఈ పురస్కారాన్ని ఈయనకు రాజధాని సువాలో ప్రదానం చేశారు. ఈయన 'ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్'ను స్థాపించారు. మానవ స్ఫూర్తిని పెంపొందించడానికి, విభిన్న సమాజాలను శాంతి, సామరస్యంతో అనుసంధానించడానికి అవిశ్రాంతంగా కృషి చేసినందుకు ఈ పురస్కారాన్ని అందించారు.