నేడు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సంయుక్త సమావేశం

80చూసినవారు
నేడు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సంయుక్త సమావేశం
బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సంయుక్త సమావేశం తెలంగాణ మాజీ సీఎం, పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన ఆదివారం జరగనుంది. ఎర్రవెల్లిలోని కేసీఆర్‌ నివాసంలో ఈ సమావేశం నిర్వహించనున్నారు. సోమవారం నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్‌ ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేయనున్నారు. కాంగ్రెస్ ప్రజావ్యతిరేక విధానాలు, హైడ్రా, లగచర్ల ఉదంతం వంటి అంశాలపై కేసీఆర్‌ మార్గనిర్దేశం చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్