BREAKING: డివైడర్‌ను ఢీకొన్న బైక్.. తండ్రీ, కుమార్తె మృతి

36643చూసినవారు
BREAKING: డివైడర్‌ను ఢీకొన్న బైక్.. తండ్రీ, కుమార్తె మృతి
ఏలూరు జిల్లా పెదపాడు మండలంలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కలపర్రు జాతీయ రహదారిపై డివైడర్‌ను బైక్ ఢీకొట్టింది. ఈ ఘటనలో తండ్రీ, కుమార్తె అక్కడికక్కడే మృతి చెందగా.. మృతుడి భార్య, కుమారుడి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విజయవాడ దుర్గమ్మను దర్శించుకొని ఏలూరు వస్తుండగా ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్