ఏపీలో ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులకు ఏప్రిల్ 7 నుంచి 23వ తేదీ వరకు బ్రిడ్జి కోర్సు నిర్వహించనున్నారు. ఆంగ్ల భాష కమ్యూనికేషన్ నైపుణ్యాలు, గణితంలో బేసిక్స్, రసాయన, భౌతిక, జీవశాస్త్రాలకు సంబంధించి ప్రయోగాలపై అవగాహన కల్పిస్తారు. పదోతరగతి పరీక్షలు పూర్తయిన తర్వాత వచ్చే పిల్లల్ని ఫస్టియర్‌కు సంసిద్ధుల్ని చేస్తారు. ఈ ఏడాది ఫస్టియర్‌లో బోర్డు అనేక మార్పులు తెచ్చింది.