ఏపీలో దారుణ హత్య

76చూసినవారు
ఏపీలో దారుణ హత్య చోటు చేసుకుంది. నంద్యాల జిల్లా అయ్యలూరు శివారు ప్రాంతంలో ఉన్న ఓ వెంచర్‌లో కానిస్టేబుల్ సురేంద్ర హత్య కేసు ప్రధాన నిందితుడు కవ్వ సాయి అలియాస్ అల్లూరి వెంకటసాయి దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని వ్యక్తులు అతన్ని దారుణంగా నరికి చంపారు. కాగా మృతుడు సాయిపై నంద్యాలలో రౌడీ షీట్‌తో పాటు పలు కేసులు ఉన్నాయి. పాత కక్షలే హత్యకు కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. క్లూస్ టీం ద్వారా ఆధారాలను సేకరిస్తున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్