AP: విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం ఎరుకొండలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఆదివారం రాత్రి కొప్పెర్ల మద్యం దుకాణం వద్ద గొర్లె పవన్ కుమార్, బొంతు అప్పలనాయుడు మధ్య ఘర్షణ జరిగింది. గ్రామానికి వచ్చాక పవన్‌పై అప్పలనాయుడు కత్తితో దాడి చేశాడు. తీవ్ర గాయాలతో పవన్ అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు నిందితుడు అప్పలనాయుడును అదుపులోకి తీసుకున్నారు.