AP: ఎన్నికల సంఘం అధికారుల నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైనట్లు బీటీ నాయుడు డిక్లరేషన్ ఫామ్ అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెండవసారి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించిన సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ కు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల సమస్యలపై ఎమ్మెల్సీగా తన వంతు పోరాటం చేస్తానని హామీ ఇచ్చారు.