ఏపీలో ఈ నెల 3న మంత్రివర్గ సమావేశం నిర్వహించనున్నారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ నెల 4న జరగాల్సిన క్యాబినెట్ భేటీని 3వ తేదీకి మారుస్తూ సీఎస్ నీరభ్ కుమార్ ఉత్తర్వులిచ్చారు. ఆదివారం సాయంత్రంలోగా ప్రతిపాదనలను పంపాలని అన్ని శాఖలను ఆదేశించారు. కొత్త రేషన్ కార్డులు, పెన్షన్లు, అదానీ విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారం, పథకాల అమలు తీరుపై చర్చిస్తారని సమాచారం.