నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థులు

58చూసినవారు
నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థులు
AP: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 3 రాజ్యసభ స్థానాలకు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. టీడీపీ నుంచి బీద మస్తాన్ రావు, సానా సతీశ్, బీజేపీ నుంచి ఆర్.కృష్ణయ్య నామినేషన్లు వేశారు. అసెంబ్లీ ప్రాంగణంలో వీరు నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. 3 స్థానాలకు ముగ్గురే నామినేషన్లు దాఖలు చేయడంతో ఎన్నికలు ఏకగ్రీవం కానున్నాయి. కాగా, వైసీపీ నుంచి బీద మస్తాన్ రావు, మోపిదేవి వెంకటరమణ, ఆర్.కృష్ణయ్య రాజీనామాలు చేయడంతో ఈ ఖాళీలు ఏర్పడిన విషయం తెలిసిందే.

సంబంధిత పోస్ట్