నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న రియాలిటీ షో ‘బిగ్ బాస్’ ప్రసారాన్ని నిలిపివేయాలని దాఖలైన పిటిషన్‌ను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. ఈ షో అసభ్యంగా ఉందంటూ కొన్ని ఫోటోలను చూపించి ప్రోగ్రామ్‌ను ఆపేయాలంటే సాధ్యం కాదని స్పష్టం చేసింది. పిటిషనర్‌కు అసభ్యకరంగా అనిపించిన సన్నివేశాలు ఇతరులకు అసభ్యం కాకపోవచ్చని పేర్కొంది. కేబుల్ టీవీ నియంత్రణ చట్టం ప్రకారం సంబంధిత అధికారుల ముందు పిటిషనర్ తన అభ్యంతరాలను తెలుపవచ్చని పేర్కొంది.