విజయసాయి రెడ్డిపై కేసులు నమోదు చేస్తాం: హోం మంత్రి అనిత

72చూసినవారు
AP: సీఎం చంద్రబాబు గురించి మాట్లాడే స్థాయి విజయసాయి రెడ్డికి లేదని హోం మంత్రి అనిత అన్నారు. తమ తప్పులు బయటపడుతున్నాయన్న భయంతో విజయసాయి రెడ్డి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఆయనపై తప్పకుండా కేసులు నమోదు చేస్తామన్నారు. కాకినాడ పోర్టు కేసులో విచారణ జరుగుతోందని.. వైసీపీ నేతలు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని అనిత ఫైర్ అయ్యారు. జగన్ అండ్ కో ఏపీ సంపదను దోచుకున్నారని ఆమె విమర్శించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్