మైనర్ బాలిక కిడ్నాప్.. పీఎస్ ఎదుట బాలిక తల్లిదండ్రులు ఆత్మహత్మాయత్నం (వీడియో)

59చూసినవారు
AP: మా అమ్మాయిని రక్షించి మాకు న్యాయం చేయండంటూ ఓ మైనర్ బాలిక తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ ఎదుట నిరసనకు దిగిన ఘటన శ్రీ సత్యసాయి జిల్లాలో చోటుచేసుకుంది. మడకశిర మండలానికి చెందిన 16 ఏళ్ల మైనర్ బాలిక ఈ నెల 6న కిడ్నాప్‌కు గురైంది. దీంతో పోలీసులను ఆశ్రయించిన ఫలితం లేకపోయిందని సోమవారం మడకశిర పీఎస్ ఎదుట బాలిక తల్లిదండ్రులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. దీంతో వెంటనే వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

సంబంధిత పోస్ట్