ఏపీలోని చిత్తూరు జిల్లాలో దారుణం జరిగింది. భార్య సమాధి దగ్గర భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. రామకుప్పం మండలం బైపరెడ్లపల్లికి చెందిన గంగిరెడ్డి ఇంట్లో గొడవల కారణంగా తన భార్య సుజాతపై కత్తితో దాడి చేయడంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఆ వెంటనే గంగిరెడ్డి పోలీసులకు లొంగిపోయాడు. ఆరు నెలల జైలుశిక్ష అనంరతం శనివారం బెయిల్‌పై విడుదలయ్యాడు. ఇంటికి వచ్చిన అతడు తన భార్య సుజాత సమాధి దగ్గర ఉన్న చెట్టుకు ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు.