TG: జీతం పెంచాలని నిరసనకు దిగిన ఆశా కార్యకర్తలను కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసులతో ఇష్టారీతిన కొట్టించడం దుర్మార్గం అని హరీశ్ రావు అన్నారు. HYDలోని కోఠిలో ఆశాలపై పోలీసుల దాడులను ఖండిస్తున్నామని ఆయన ట్వీట్ చేశారు. 'ఆశా వర్కర్లకు నిరసించే హక్కు లేదా? సమస్యలు పరిష్కరించాలని అడిగే స్వేచ్ఛ లేదా?' అని ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆశా వర్కర్ల వేతనాలు పెంచుతామని హామీ ఇచ్చారని గుర్తుచేశారు.