AP: రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులోనే ఉన్నాయని మాజీ మంత్రి టీజీ వెంకటేశ్ అన్నారు. ఫ్యాక్షన్‌ను అణచివేయడంలో చంద్రబాబు దిట్ట అని తెలిపారు. మోదీ ఆశీస్సులతో ఏపీ అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. రాయలసీమనే కాదు రాష్ట్రాన్నే అభివృద్ధి చేయగల సత్తా చంద్రబాబుకి ఉందన్నారు. పెన్నా-గోదావరి నదుల అనుసంధానానికి సీఎం చంద్రబాబు భగీరథ ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. విభజన హామీల్లో వచ్చిన మేరకు తీసుకోవాలన్నారు.