అమర కెప్టెన్ అన్షుమాన్ సింగ్ భార్య స్మృతిపై అసభ్యకరమైన వ్యాఖ్య చేసిన నెటిజన్‌పై కేసు నమోదైంది. ఇటీవల, అన్షుమాన్‌కు చేసిన సేవలకు గాను ఆయన భార్య స్మృతికి కేంద్రం 'కీర్తిచక్ర' అవార్డును ప్రదానం చేసింది. ఈ సందర్భంగా ఆమె ఎమోషనల్ గా దిగిన ఫోటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. ఆమెపై ఓ నెటిజన్ అసభ్యకరమైన కామెంట్ చేశాడు. దీనిని సుమోటోగా స్వీకరించిన జాతీయ మహిళా కమిషన్ ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది.