AP: కూటమి ప్రభుత్వం హామీల అమలులో పూర్తిగా విఫలమైందని వైసీపీ మాజీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు విమర్శించారు. 'కూటమి పార్టీలు అనేక హామీలు ఇచ్చాయి. ఛార్జీలు తగ్గిస్తామంటూ ప్రచారం చేసి ఇప్పుడు రూ.15,485 కోట్ల భారాన్ని ప్రజలపై మోపాయి. ప్రభుత్వం అమరావతి కోసం రూ.30 వేల కోట్లు అప్పు చేసింది. ఆదాయం గణనీయంగా పడిపోయింది. ప్రస్తుతం అప్పులతోనే నడుస్తోంది. చంద్రబాబు ప్రజల మీద కసి తీర్చుకుంటున్నారు' అని మండిపడ్డారు.