AP: వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ క్రిస్మస్ సందర్భంగా క్రైస్తవులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. కరుణ, ప్రేమ, క్షమ, ఓర్పు, దాతృత్వం, త్యాగం.. ఇవన్నీ క్రీస్తు తన జీవితం ద్వారా మానవాళికి ఇచ్చిన గొప్ప సందేశాలని జగన్ అన్నారు. యేసుక్రీస్తు మానవాళిని సత్య మార్గం వైపు నడిపించారని ఆయన అన్నారు. క్రీస్తు బోధనలు ఎల్లప్పుడూ ప్రజలందరినీ సరైన మార్గంలో నడిపిస్తాయని ఆయన అన్నారు.