వాజ్‌పేయీ శత జయంతి .. రేపు ఎన్డీయే నేతల కీలక భేటీ

57చూసినవారు
వాజ్‌పేయీ శత జయంతి .. రేపు ఎన్డీయే నేతల కీలక భేటీ
బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో బుధవారం ఎన్డీయే నేతల సమావేశం జరగనుంది. అటల్ బిహారీ వాజ్‌పేయీకి నివాళి కార్యక్రమం అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు లేదా సాయంత్రం 4 గంటలకు భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఎన్డీయే నేతల సమావేశానికి ఏపీ సీఎం చంద్రబాబు హాజరుకానున్నారు. దేశంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, పార్లమెంటు సమావేశాల సందర్భంగా చోటు చేసుకున్న ఘటనలు, తదుపరి కార్యాచరణపై నేతలు చర్చించనున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్