బెళగావిలో ప్రేమికుడి మోసం తట్టుకోలేక ఐశ్వర్య ప్రాణాలు తీసుకున్న ఘటన కొత్త మలుపు తిరిగింది. ఆకాశ్ మరో అమ్మాయితో ప్రేమలో ఉన్నాడని తెలిసి "నా మరణానికి నువ్వే కారణం" అంటూ మెసేజ్ పంపించింది. ఆకాశ్, ఐశ్వర్య హాస్టల్‌కి వెళ్లి, ఉరికి వేలాడుతున్నా కనీసం పట్టించుకోకుండా ఆమె మొబైల్ తీసుకుని పారిపోయాడు. ఈ దృశ్యాలన్నీ హాస్టల్ CC కెమెరాలో రికార్డయ్యాయి. పోలీసులు ఆకాశ్‌ని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.