TG: చెప్పకుండా బైటకు వెళ్లారని ప్రిన్సిపల్ విద్యార్థినులను దారుణంగా కొట్టారు. వికారాబాద్‌లోని కొత్తగడి సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల/కళాశాల విద్యార్థినులను ప్రిన్సిపల్ బూతులు తిడుతూ కొట్టారు. తాము వెళ్లడం తప్పేనంటూ విద్యార్థినులు చెప్పే ప్రయత్నం చేస్తుండగా.. ఓ విద్యార్థినిని పలుమార్లు చెంప దెబ్బలు కొట్టారు. కాగా గత నెలలో ఈ పాఠశాల భవనంపై నుంచి ఓ విద్యార్థిని కిందకు దూకిన ఘటన మరవకముందే మరో ఘటన జరగడం చర్చనీయాంశంగా మరింది.