అనకాపల్లి కలెక్టర్‌కు చంద్రబాబు ఫోన్.. పేలుడు ఘటనపై ఆరా

60చూసినవారు
అనకాపల్లి కలెక్టర్‌కు చంద్రబాబు ఫోన్.. పేలుడు ఘటనపై ఆరా
అనకాపల్లిలోని అచ్చుతాపురంలో ఫార్మా కంపెనీలో పేలుడు ఘటనపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంపై జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్‌తో ఆయన ఫోన్‌లో మాట్లాడారు. ప్రమాద వివరాలను ఆరా తీశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. సహాయక చర్యలు ముమ్మరంగా చేపట్టాలని సూచించారు. కాగా, ఈ ఘటనలో ఇప్పటి వరకు ఐదుగురు చనిపోయారు. మరో 13 మంది తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్