నాలుగు ఓట్ల కోసమే చంద్రబాబు అబద్ధపు హామీలు: సజ్జల

72చూసినవారు
నాలుగు ఓట్ల కోసమే చంద్రబాబు అబద్ధపు హామీలు: సజ్జల
వాలంటీర్లపై గతంలో చంద్రబాబు, దత్తపుత్రుడు విషం కక్కారని.. ఇప్పుడు సడెన్‌గా ప్రేమ కురిపిస్తున్నారని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ రెడ్డి ఫైర్ అయ్యారు. గురువారం తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ.. అధికారంలోకి రాగానే వాలంటీర్ల వ్యవస్థను తీసేస్తామన్న చంద్రబాబు ప్రస్తుతం వారికి రూ.10 వేలు ఇస్తామంటున్నారన్నారు. ఇప్పటికీ చంద్రబాబు గతంలానే మాటలు మారుస్తున్నారని, నాలుగు ఓట్ల కోసమే అబద్ధపు హామీలు ఇస్తున్నారని మండిపడ్డారు.

సంబంధిత పోస్ట్