ఇజ్రాయెల్‌కు 6,000 మంది భారత కార్మికులు

70చూసినవారు
ఇజ్రాయెల్‌కు 6,000 మంది భారత కార్మికులు
హమాస్‌తో ఘర్షణల వల్ల ఇజ్రాయెల్ నిర్మాణ రంగాన్ని కార్మికుల కొరత వేధిస్తోంది. దీంతో విదేశాల నుంచి శ్రామికులను ఆహ్వానిస్తోంది. అందులో భాగంగా ఏప్రిల్, మేలో భారత్ నుంచి 6000 మంది కార్మికులు అక్కడికి చేరుకోనున్నట్లు స్థానిక ప్రభుత్వం ప్రకటించింది. ప్రయాణ ఖర్చుల్లో రాయితీ ఇవ్వాలని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి కార్యాలయం, ఆర్థికశాఖ, నిర్మాణశాఖ సంయుక్తంగా నిర్ణయించాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్