AP: సీఎం చంద్రబాబు శుక్రవారం తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. మనవడు దేవాన్ష్ పుట్టిన రోజు సందర్భంగా ఇవాళ అన్నప్రసాద వితరణ చేయనున్నారు. భక్తులకు అన్నప్రసాదాలు వడ్డించనున్నారు. మంత్రి నారా లోకేశ్ సహా కుటుంబ సభ్యులంతా నిన్న రాత్రి పద్మావతి గెస్ట్ హౌజ్‌కు చేరుకున్నారు. ఆయనకు టీటీడీ చైర్మన్, ఈవో స్వాగతం పలికారు.