ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్ జేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్ ఆటతీరుపై ఆసీస్ మాజీ క్రికెటర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ సంచలన వ్యాఖ్యలు చేశారు. IPL-2025లో మెక్‌గర్క్ ఓపెనర్‌గా ఉత్తమ్ ప్రదర్శన కనబరుస్తూ ఆడటం చాలా ముఖ్యం అని అన్నారు. సుదీర్ఘ కాలం పాటు ఫామ్ లేకపోతే ఐపీఎల్ కోచ్లు, యజమానులు సహించరని ఆయన పేర్కొన్నారు. తన తొలి ఐపీఎల్‌లో 9 ఇన్నింగ్స్ ఆడిన జేక్ 4 అర్ధ సెంచరీలతో 330 పరుగులు చేశారు. అతను ఇప్పటివరకు 7 T20Iలలో కేవలం 113 పరుగులే చేశారు.