భర్త వేధింపుల కారణంగా ఢిల్లీలో ఓ టీచర్ ఆత్మహత్యకు పాల్పడింది. అన్వితా శర్మ (31) ఘజియాబాద్‌లోని తన ఇంట్లో ఆదివారం ఆత్మహత్య చేసుకుంది. "ఆ వ్యక్తి ఎప్పుడు తప్పులు జరుగుతాయా అని ఎదురుచూసేవాడు. అతను నన్ను కాదు, నా ఉద్యోగాన్ని వివాహం చేసుకున్నాడు" అని ఆమె చనిపోయే ముందు తన సోదరుడికి సందేశం పంపారు. గతంలో అన్వితా విడాకులు కోరగా.. ఇకపై వేధించనని మాట ఇచ్చి భర్త ఆమెను తీసుకెళ్లినట్లు మృతురాలి సోదరుడు తెలిపారు.