ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో పంజాగుట్ట పీఎస్‌కు హాజరైన విష్ణుప్రియ, రీతూ చౌదరిల పోలీసు విచారణ ముగిసింది. గురువారం పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో విష్ణుప్రియను దాదాపు 10 గంటల పాటు విచారించారు. అదేవిధంగా ఇదే కేసులో రీతూ చౌదరిని సుమారు 6 గంటల పాటు విచారించారు. తదుపరి విచారణకు మార్చి 25న ఇద్దరూ హాజరుకావాలని పోలీసులు ఆదేశించారు. ఈ క్రమంలో వీరిద్దరూ పీఎస్ నుంచి బయటకు వచ్చిన వీడియో వైరల్ అవుతోంది.