కర్ణాటక ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (KERC) గురువారం విద్యుత్ ధరలను యూనిట్ 36 పైసలు పెంచింది. కొత్త ధరలు ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రానున్నాయి. గృహ జ్యోతి పథకం కింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ లభిస్తున్నందున విద్యుత్ ధరల పెరుగుదల 85% జనాభాను ప్రభావితం చేయదని అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. దీనిపై కర్ణాటక రాష్ట్రంలో సర్వత్రా వ్యతిరేకతలు వ్యక్తమవుతున్నాయి.