టీడీపీ ఎమ్మెల్యేపై సొంత పార్టీ నేతలే రగిలిపోతున్నారు. దీంతో తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుపై ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయం దిశగా చంద్రబాబు అడుగులు వేస్తున్నారు. సొంత పార్టీ నుంచి వ్యతిరేకత వస్తున్న క్రమంలో సీఎం చంద్రబాబు తిరువూరు ఎమ్మెల్యేను నియోజకవర్గ బాధ్యతల నుంచి పక్కనపెట్టి మరొకరికి బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. తిరువూరు బాధ్యతలను మైలవరం ఎమ్మెల్యే వసంతకు అప్పగించారని పార్టీ నేతల సమాచారం.