దేశ రాజధాని ఢిల్లీలో దారుణ ఘటన జరిగింది. ద్విచక్ర వాహనంపై వెళుతున్న ఓ కానిస్టేబుల్‌ను వెనుక నుంచి వచ్చిన కారు ఢీకొట్టి దాదాపు 10 మీటర్లు ఈడ్చుకెళ్లింది. ఈ షాకింగ్ ఘటనకు సంబంధించిన వీడియో తాజాగా నెట్టింట వైరల్ అవుతోంది. ఢిల్లీలోని నాంగ్లోయ్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. పెట్రోలింగ్ డ్యూటీలో ఉన్న సందీప్ అనే కానిస్టేబుల్‌ను కారు ఢీకొట్టింది. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మరణించినట్టు వైద్యులు ప్రకటించారు.