టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్, ఇతర టీడీపీ నేతలు ప్రజా దర్బార్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా టీడీపీ నేతలు అర్జీలు స్వీకరిస్తున్నారు. అయితే ఎక్కువ శాతం మంది భూముల సమస్యలపై వినతిపత్రాలు ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రజా దర్బార్‌లో వస్తున్న సమస్యలు చూసి సీఎం చంద్రబాబు షాక్ తిన్నట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.