తిరుమలలో అన్యమత ప్రచారానికి సంబంధించి మరో ఘటన వెలుగులోకి వచ్చింది. తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లిన హైదరాబాద్‌కు చెందిన శ్రీధర్ కుటుంబం స్టీల్ కడియం కొనుగోలు చేశారు. రూమ్‌కి వెళ్లిన తర్వాత కడియాన్ని పరీక్షించగా.. దానిపై అన్యమతం పేరు, గుర్తు కనిపించడంతో షాక్‌కు గురయ్యారు. ఈ ఘటనపై టీటీడీ ఛైర్మన్‌కు భక్తుడు ఫిర్యాదు చేశారు. కడియం విక్రయించిన షాప్‌ను టీటీడీ అధికారులు సీజ్ చేశారు.