విశాఖకు చేరుకున్న సీఎం చంద్రబాబు

66చూసినవారు
విశాఖకు చేరుకున్న సీఎం చంద్రబాబు
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విశాఖపట్నం చేరుకున్నారు. మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారానికి ముంబై వెళ్లిన చంద్రబాబు కార్యక్రమం ముగిసిన అనంతరం నేరుగా విశాఖకు చేరుకున్నారు. అక్కడి నుంచి టీడీపీ కార్యాలయానికి వెళ్లారు. ఈ రాత్రికి అక్కడే బస చేసి శుక్రవారం జరిగే డీప్ టెక్నాలజీ సమ్మిట్ 2024 కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొననున్నారు. ఈ సదస్సు తర్వాత విశాఖ మెట్రో రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ ప్రాజెక్టులపై సమీక్షిస్తారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్